తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి! చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా! సాటిలేని జాతి నేడు నిదురపొతుండాది... జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా! చేయెత్తి జైకొట్టు తెలుగోడా..!గతమెంతొ ఘనకీర్తి కలవోడా!

Monday, October 4, 2010

గజేంద్ర మోక్షము

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్


లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్

కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె, స
త్వరితా కంపిత భూమి చక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరి భూతాంబర శుక్రమున్, బహు విధ బ్రహ్మాండ భాండచ్ఛటాం
తర నిర్వక్రము బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్




వైకుంఠం తరలి వచ్చే చిత్రం

No comments:

Post a Comment